ఆంధ్రప్రదేశ్ జాతీయం

చంద్రబాబు నాయుడు అరెస్టుపై బగ్గుమన్న బద్వేలు అవినీతి జరిగి ఉంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏమి చేశారు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ శనివారం బద్వేలు బగ్గుమంది. బద్వేలు గోపవరం అట్లూరు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బద్వేల్ లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు సిద్ధమవుతున్న పార్టీ నాయకులను కార్యకర్తలను బద్వేలు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన ప్రసాద్ ఆధ్వర్యంలో అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రితేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అనంతరం వారంతా స్టేషన్ నుండి ర్యాలీగా నాలుగు రోడ్ల కూడలి మీదుగా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు నల్ల కండువాలు ధరించి ర్యాలీ జరిపారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయంలో ఉన్న పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు కాసేపు బయటికి పంపలేదు. పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఆయనతో సీఐ సుదర్శన ప్రసాద్ ఎస్సై కత్తి వెంకటరమణ చర్చలు జరిపారు. శాంతి భద్రతల దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు ఆయనకు తెలిపారు. పోరుమామిళ్లలో కూడా ఇదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోరుమామిళ్ల కలసపాడు కాశి నాయన బి కోడూరు మండలం చెందిన నాయకులు కార్యకర్తల పెద్ద ఎత్తున ఈ నిరసన లో పాల్గొన్నారు. అక్కడ కూడా పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది .పార్టీ నాయకుడు చెరుకూరి రవికుమార్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల సర్పంచ్ సుధాకర్ నాయుడు బద్వేలు మార్కెట్ కమిటీ చైర్మన్ రంతు తదితరులు నిరసన లో పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి జరిగి ఉంటే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేద. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు.  అవినీతికి చిరునామాగా నిలచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాష్ట్రం పూర్తిగా దిగ్జారిపోయిందని ఆరోపించారు. తాను అవినీతి చక్రవర్తినని అందరూ అలాగే ఉంటారని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనేక అవును అవినీతి అక్రమాలు చేసి 16 నెలలు జైల్లో గడిపిన వై జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరిని అవినీతిపరులుగా చిత్రీకరించి వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆకోవకు చెందినదే చంద్రబాబుపై అక్రమ కేసు అని అన్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టిన చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఓటమి తప్పదని ముందుగానే తెలుసుకున్న ముఖ్యమంత్రి ఇలాంటి కేసులు పెట్టడం రాజకీయ దిగజారుడు పనులు చేయడం అతనికి చెల్లిందని అన్నారు.  విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు 43 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి ప్రత్యేక విమానంలో లండన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి అత్యంత పేదవాడని ఆయన విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యముల బయటికి వస్తారని తెలిపారు.