modi
జాతీయం ముఖ్యాంశాలు

జీ20 స‌మావేశాల‌కు స్క‌ల్జ్‌.. త‌న కంటికి ఐప్యాచ్ హాజ‌ర‌యిన జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్

జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్క‌ల్జ్‌ ఢిల్లీలో జ‌రుగుతున్న జీ20 స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. భార‌త మండ‌పంలో ఉన్న కోణార్క్ వీల్ వ‌ద్ద ఇవాళ ఆయ‌నకు ప్ర‌ధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. ఆ స‌మ‌యంలో స్క‌ల్జ్‌.. త‌న కంటికి ఐప్యాచ్ ధ‌రించి ఉన్నారు. సాధార‌ణంగా కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్న వాళ్లు ధ‌రించే న‌ల్ల రంగు ప్యాచ్‌ను స్క‌ల్జ్ త‌న కంటికి ధ‌రించారు. అయితే దీనిపై ఆ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్స‌ల‌ర్ గ‌త వారం జాగింగ్ చేస్తూ గాయ‌ప‌డిన‌ట్లు ప్ర‌తినిధి తెలిపారు. దీని వ‌ల్ల ఆయ‌న కుడి క‌న్ను దెబ్బ‌తిన్న‌ది.స్వ‌ల్ప స్థాయిలో ఆయ‌న కంటికి గాయాల‌య్యాయ‌ని, మ‌రికొన్ని రోజుల పాటు స్క‌ల్జ్ ఆ బ్లాక్ క‌ల‌ర్ ఐ ప్యాచ్ ధ‌రించాల్సి ఉంటుంద‌ని ప్ర‌తినిధి తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్ర‌తి రోజూ జాగింగ్ చేసే అల‌వాటు ఛాన్స‌ల‌ర్ స్క‌ల్జ్‌కు ఉన్న‌ట్లు ప్ర‌తినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు