real
తెలంగాణ

బెంగుళూరు బాటలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వృద్ధితో అద్దెలు కూడా భారీగానే పెరిగాయని నిపుణులు అంటున్నారు. 2019తో పోలిస్తే 20-30 అద్దెలు పెరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ లో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని స్థానికులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం స్పీడ్ అందుకోవడంతో… రెంటల్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు నిపుణులు అంటున్నారు. 2022 నుంచి అద్దెలు 20-30 శాతం పెరిగాయంటున్నారు. అదేవిధంగా ఆస్తుల మూలధన విలువలు 10-15 పెరిగాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. 2023లో 2BHK ఇళ్లకు అద్దెలు రూ. 32,000 నుంచి రూ. 48,000కి పెంచినట్లు తెలుస్తోంది. 2019 నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బెంగళూరును అధిగమించి పురోగమనంలో ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.హైదరాబాద్‌ పశ్చిమ కారిడార్‌లోని హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి పరిధిలో ఐటీ రంగం విస్తరించడంతో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతుండడంతో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్‌ను బెంగళూరుతో పోలుస్తున్నారు నిపుణులు. హైదరాబాద్ తూర్పున ఉన్న సికింద్రాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా ఆఫీస్ స్థలాలు అందుబాటు ధరల్లో ఉంటున్నాయి. ఉత్తరాన ఎక్కువగా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలోని ల్యాండ్ బ్యాంకులు ఉన్నాయి. ఐటీ కారిడార్ లో 2బీహెచ్‌కే అద్దెకు రూ.20,000 నుంచి 25,000 వరకు, ఫర్మిచర్ తో ఉన్న ఇళ్లకు రూ.30,000 నుంచి 35,000 మధ్య అద్దెలు ఉంటున్నాయని నిపుణులు తెలిపారు. సాధారణ అపార్ట్‌మెంట్‌లో చదరపు అడుగుకు ధర రూ. 10,000, ప్రీమియం అపార్ట్‌మెంట్‌లకు రూ. 15,000 వరకు ఉంటుంది. గత ఏడాది ఫర్నిష్డ్ 3BHK అద్దె రూ. 25,000-30,000 కాగా, ఇప్పుడు అది రూ. 40,000కు పెరిగిందని రియల్ ఎస్టేట్ నిపుణులు తెలిపారుప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం 2019 కన్నా 2023లో కీలకమైన మైక్రో మార్కెట్‌లలో సగటు అద్దెలు 20 శాతం వరకు పెరిగాయని తెలుస్తోంది. హైటెక్ సిటీలో సగటు అద్దె 2019లో నెలకు రూ. 23,000 ఉంటే 2023 నాటికి దాదాపు రూ. 27,500కు పెరిగింది. అలాగే గచ్చిబౌలిలో అద్దెలు 2019లో రూ. 22,000, 2023లో నెలకు రూ. 26,500కి పెరిగాయి. ఇక్కడ కూడా 20 శాతం అద్దెలు పెరిగాయి.

కొండాపూర్‌లో అద్దెలు 19 శాతం పెరిగాయని అనరాక్ సంస్థ పేర్కొంది.హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగం 2019 నుంచి బెంగళూరుతో పోటీ పడుతున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనరాక్ డేటా ప్రకారం 2019లో హైటెక్ సిటీలో నెలకు సగటు అద్దెలు రూ.23,000గా ఉండగా, బెంగళూరులోని సర్జాపూర్ రోడ్‌లో దాదాపు రూ.21,000గా ఉంది. అదే సంవత్సరం బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో సగటు నెలవారీ అద్దె రూ. 19,000 కాగా, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అప్పుడు రూ. 22,000. కరోనా తర్వాత రెండు మార్కెట్లు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్‌తో పోలిస్తే బెంగళూరులో అద్దెలు పెరుగుదల స్పష్టంగా ఉంది. హైదరాబాద్‌లో ఐటీ హబ్‌లు (గచ్చిబౌలి, హైటెక్ సిటీ) అన్నీ ఒకే జోన్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతాల్లో అద్దెలు భారీగా పెరిగాయి బెంగళూరులో ఐటీ పరిశ్రమ ఉత్తర, దక్షిణ, తూర్పు జోన్‌లలో విస్తరించి ఉంది. అందుబాటులో అద్దెలు క్రమంగా పెరుగుదల నమోదు అవుతున్నాయి. కోవిడ్ తర్వాత కార్యాలయాలు తెరుచుకోవడంతో బెంగళూరులో అద్దెలు పెరిగాయి.

హైదరాబాద్‌లో అద్దె భవనాల సరఫరా కూడా పెరిగిందని నిపుణులు అంటున్నారు. అయితే వార్షిక రియల్ ఎస్టేట్ వృద్ధిలో హైదరాబాద్ బెంగళూరుతో పోటీగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. 2023 ప్రథమార్థంలో బెంగళూరులో 30,710 యూనిట్లు అమ్ముడవ్వగా, 2022 కంటే 23 శాతం పురోగతి నమోదైంది. అదే సమయంలో హైదరాబాద్‌లో హౌసింగ్ అమ్మకాలు 2023 ప్రథమార్థంలో 27,845 యూనిట్లు అమ్ముడవ్వగా, 2022లో దాదాపు 24,330 యూనిట్లు వృద్ధి నమోదైంది. వార్షిక వృద్ధి 14 శాతంగా ఉంది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాలలో ఆస్తులపై రాబడులు ఐదేళ్లలో రెట్టింపు అవుతాయని నిపుణులు అంటున్నారు. దానితో పాటు, అద్దె మార్కెట్ ఇప్పటికే హైదరాబాద్‌లో వృద్ధి చెందుతోందన్నారు.