gudivada
ఆంధ్రప్రదేశ్ జాతీయం

మరిన్ని స్కామ్ లు బయటకు రానున్నాయి మంత్రి అమర్ నాథ్

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, త్వరలో మరిన్ని స్కామ్ లు బయటకు వస్తాయని బాంబు పేల్చారాయన.దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చి ఏపీ సీఎంగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు జైలు పాలయ్యారని. అభినవ వీరప్పన్ చంద్రబాబు ఖైదీ నంబర్ 7691 చంద్రబాబు ఇంతకాలం చట్టం నుంచి తప్పించుకున్నారని . అడవుల్లో ఉన్న వీరప్పన్ ఎలా తప్పించుకోలేకపో యారో అలాగే చంద్రబాబు కూడా తప్పించుకోలేకపోయారని స్కిల్ కుంభకోణం, ఫైబర్ నెట్, అమరావతి ల్యాండ్ ఇలా ఎన్నో స్కాంలు చంద్ర బాబు చేశారని అన్నారు.సీమెన్స్ వ్యవహారాల్లో 371 కోట్ల డబ్బు మీ జేబుల్లోకి వెళ్లిందని కోర్టులు నమ్మా యని,అందుకే చంద్రబాబు జైలుకి వెళ్లారని,ఇందులో రాజకీయ కక్ష ఏ మాత్రం లేదని చెప్పారు.