కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. గురువారం ఉదయం ఆర్కేపురం – సరూర్ నగర్ మెయిన్ రోడ్డుపై సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసారు. మహేశ్వరం నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ అందేల శ్రీరాములు మాట్లాడుతూ ఉద్యోగాలు – నిరుద్యోగ భృతి ఇవ్వలేని దద్దమ్మ కేసిఆర్… రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. నిరుద్యోగ యువతను దగా చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసిఆర్ పై రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోరుబాట మొదలు పెట్టారని అన్నారు. ఇందిరా పార్కులో శాంతియుతంగా 24 గంటల నిరాహార దీక్ష చేస్తుంటే మహిళా మోర్చా నాయకురాళ్లను కొట్టి అక్రమంగా అరెస్టు చేసి బీజేపీ కార్యాలయానికి తరలించారని శ్రీరాములు మండిపడ్డారు.
ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ… బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు.
నిరుద్యోగ భృతి, ఉద్యోగ, ఉపాధి చూపలేని చాతకాని బీఆర్ఎస్ సర్కార్… కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వచాతకాదు – ఉపాధ్యాయ పోస్టులు నింపచాతకాదు – నోటిఫికేషన్లు ఇవ్వటం తప్పా… భర్తీ చేయటం చేతకాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అందెల శ్రీరాములు.
మహిళలను సైతం ఈడ్చివేసి కిషన్ రెడ్డిని అరెస్టు చేయటంపై కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, పిట్ట ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముంతా రాములు, సిద్దూ ముదిరాజ్ ఖండించారు. ఈ కార్యక్రమంలో కాషాయ దళ శ్రేణులు ర్యాలీ చేశాయి.