తే.14.09.2023 దిన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి.
వెంకటగిరి లోని త్రిభువని సెంటర్ వద్ద ఈశ్వరయ్య టీ స్టాల్ పక్కన ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి & నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈరోజు దీక్షలో వెంకటగిరి పట్టణములోని అన్ని వార్డుల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బాలాయపల్లి, సైదాపురం, రాపూరు మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు జనసేన నాయకులు కూడా మద్దతు గా దీక్షలో కూర్చున్నారు.