mallareddy
తెలంగాణ రాజకీయం

ప్రభుత్వ పథకాలతో కులవృత్తిదారులకు భరోసా

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో కుల వృత్తిదారులకు భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన బీసీ కుల వృత్తిదారులకు, రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదని అన్నారు. బీసీ కుల వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సహకారాన్ని బీసీ కుల వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి కేశూరామ్, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు బి. నానునాయక్, ఎన్. సుజాత, ఆర్. శ్రీహరి గౌడ్, బిఆర్ఎస్ దమ్మాయిగూడ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్.హరి గౌడ్, నాయకులు, వి శ్రీకాంత్ గౌడ్, కె. శ్రీనివాస్ గౌడ్, కె. భాస్కర్ గౌడ్, కాజా మియా, డి. సాయినాథ్ గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు