cong
ఆంధ్రప్రదేశ్ జాతీయం

కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ తుక్కుగుడలో తలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి కి కోరుట్ల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు  ఆధ్వర్యంలో ఆదివారం కోరుట్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.. ఈ సంధర్బంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ తెలంగాణ యావత్ ప్రజానీకం కన్నీళ్లను కష్టాలను,గొప్ప  ఆశయాలను ఒక తల్లి లాగా అర్థం చేసుకుని రాజకీయంగా నష్టపోయే అవకాశం 100% ఉన్నదని తెలిసి కూడా ఎన్నో సవాళ్ళను ఆటుపోట్లను ఎదుర్కొని మనకు యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన చారిత్రక ఘట్టం అందరికీ తెలిసిందేనని, స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం ఒక్క కల్వకుంట్ల కుటుంబం తప్ప యావత్ తెలంగాణ అన్ని వర్గాల ప్రజానీకం ఎదుర్కుంటున్న తిప్పలు అన్ని ఇన్ని కావని, కేసిఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు, బీఆర్ఎస్ అహంకార ప్రభుత్వాన్ని రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేసెందుకు ప్రజల్లో చైతన్యం నింపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ తలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి కి తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ రావడం జరిగిందని, తెలంగాణ చరిత్రలో ఈ సభ ఒక కీలక ఘట్టం కానుందని ఆయన అన్నారు.. ఈ భారీ బహిరంగ సభలో గ్యారంటీ స్కీంలను తల్లి సోనియా గాంధీ స్వయంగా ప్రజానీకానికి తెలియజేయడం జరుగుంతుదని అన్నారు..