వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఇవ్వాలని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఆదివారం ‘స్వచ్ఛత హి సేవ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాల ప్రాంతాల్లో కౌన్సిలర్లు, నాయకులు పరిసరాలను శుభ్రం చేసి ప్లాస్టిక్ కవర్లను ఏరి వేసి, చెత్తను తొలగించారు. అహ్మద్గూడ రాజు గృహకల్ప కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎస్. రాజమల్లయ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు