manipur
జాతీయం

మణిపూర్ లో మళ్లీ హింస

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సెప్టెంబరు 16న పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు యువకులను వెంటనే విడుదల చేయాలంటూ స్థానికులు పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. పరిస్థితులు చేయిదాటిపోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. వాస్తవానికి భద్రతా బలగాల యూనిఫాంలతో అత్యాధునిక ఆయుధాలతో తిరుగుతున్న యువకులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు.అయితే  తమ వారిని విడిచి పెట్టాలంటూ స్థానికులు ఆందోళనలు చేపట్టారు. 48 గంటల లాక్‌డౌన్‌ పాటించారు. ఆ తర్వాత వందలాది మంది నిరసనకారులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లోని ఆయా పోలీస్‌ స్టేషన్‌ల ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది.
కాగా, మణిపూర్‌లో చాలా కాలంగా మైతేయ్‌, కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. మణిపూర్‌లో 50 శాతానికి పైగా ఉన్న మైతేయ్‌లకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఈ ఏడాది మే నెలలో ఆ రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు యత్నించడాన్ని కుకీలు వ్యతిరేకించారు. ఆ నాటి నుంచి రెండు జాతుల మధ్య ఘర్షణలు జరిగాయి. వందలాది ఇళ్లను రెండు వర్గాల వారూ తగులబెట్టారు. హింసలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవలే ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతలోనే మళ్లీ హింస చెలరేగింది.