motkupalli
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జగన్ రాక్షసానందం

ప్రతిపక్ష నేత  చంద్రబాబును  జైల్లో పెట్టి ఏపీ సీఎం జగన్ రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  . ‘‘జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. వైఎస్‌ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదు. ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్‌లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా?’’ అని ఏపీ  మోత్కుపల్లి ప్రశ్నించారు.  
 2018 ఎన్నికల సమయంలో ఇదే ఘాట్ నుంచి నేను మాట్లాడుతూ జగన్ గెలవాలని ప్రచారం చేశానన్నారు. తన  పిలుపుతో దళిత వర్గాలు, పేద వర్గాలన్నీ ఏకమై జగన్ ను గెలిపించాయన్నారు.  అధికారంలోకి వచ్చిన తెల్లారే జగన్ మైకంలోకి వెళ్లాడు. ఆ మైకం ఎంత వరకు వెళ్లిందంటే… తల్లిని ఇంటి నుంచి బయటకు పంపించాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వేల కిలోమీటర్లు నడిచిన చెల్లెలు షర్మిలను మెడబట్టి బయటకు గెంటాడు. ఆయన పాలన ఎలా ఉందంటే… రాజధాని లేని రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. జగన్ పాలించే రాష్ట్రంలో రాజధానే లేదు. 151 సీట్లు ప్రజలిస్తే అది అహంకారంలోకి వెళ్లింది. ఒక్క ఛాన్స్ ఇస్తే బాగా పాలిస్తాడని ప్రజలు నమ్మారు. కానీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ పాలిస్తున్నాడు. మాట్లాడిన వాడినల్లా కొట్టి, తిట్టి, భయపెట్టి నియంత మాదిరి జగన్ రాజ్యమేలుతున్నాడని మోత్కుపల్లి మండిపడ్డారు. 74 సంవత్సరాల పెద్దమనిషి, ఈ దేశానికే నాయకుడు, వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నావా? నువ్వొక దుర్మార్గుడివి. 2021లో కేసు బుక్ అయింది. కేసులో ఉన్న వారంతా బెయిల్ పై ఉన్నారు.

ఇప్పుడు చంద్రబాబును ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం ఏమిటి? చంద్రబాబు వంటి పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏపీలో టీడీపీ హయాంలో రూ. 7 – 8 లక్షల కోట్ల బడ్జెట్ చంద్రబాబు చేతుల మీదుగా ప్రజలకు వెళ్లింది. అలాంటి పెద్ద మనిషి ముష్టి రూ. 371 కోట్లకు దిగజారుతాడా? మాట్లాడేందుకు నీకు సిగ్గు, బుద్ధి ఉందా? మూడు సార్లు ముఖ్యమంత్రి, ఎన్నడూ ఏ ఆరోపణ కూడా రుజువు కాలేనటువంటి పెద్దమనిషి చంద్రబాబు. ఆయన ఏనాడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు.  వ్యక్తులే లేకుండా చేయాలనుకుంటున్నావా జగన్? ఈ నాలుగేళ్లు ఏం పీకావని నేను అడుగుతున్నా. ఎన్నికలు రేపు అనగా.. ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? చంద్రబాబు వయసుకు విలువిచ్చి నీవు వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పు” అంటూ జగన్ పై మోత్కుపల్లి ఫైర్ అయ్యారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న మోత్కుపల్లి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబుపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి పని చేశారు