టికెట్లపై ప్రతి ఒక్కరూ తన నిర్ణయాల ను స్వాగతించాలని సీఎం జగన్ పార్టీ నేతలలను కోరారు. టికెట్ రాని వాళ్లకు మరో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చా రు.ఇక గేర్ మార్చాల్సిన టైం వచ్చిందని పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీ లు, నియో జకవర్గ ఇన్ ఛార్జీలతో సమావేశం అయ్యా రు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీ య సమన్వ యకర్తలు కూడా పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంపై సీఎం జగన్ సమీక్షించారు.ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడు తూ ఇప్ప టి వరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు ఇకపై చేసే కార్యక్రమా లు మరొక ఎత్తు అన్నారు.
వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం అన్నారు.175కి 175 స్థానాలు గెలుచు కోవడం పాజిబుల్ అవుతుందన్నా రు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థి తులు ఉన్నాయ న్న సీఎం జగన్… ఒంటిరిగా పోటీ చేయలేక ప్రతిపక్షా లు పొత్తులకు వెళ్తున్నాయన్నారు.