చట్ట విరుద్ధంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అరెస్ట్ చేశారని.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A తనకు వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై వచ్చే నెల మూడో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కేవియట్ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ వాదన కూడా వినాలని కోరింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లు మొదటగా ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లగా.. నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి భట్టి ప్రకటించారు. దీంతో చంద్రబాబు తరలు లాయర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దగ్గర మెన్షన్ చేశారు. ఆయన పిటీషన్ ను పరిగణలోకి తీసుకుంటూ.. చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్నారు. క్వాష్ పిటీషన్ కొట్టివేయాలని.. చంద్రబాబుపై నమోదైన కేసులను కొట్టివేయాలని వాదించారు. చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ .. కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నానని.. అక్టోబర్ 3వ తేదీన ఆ బెంచ్ వాదనలు వింటుందని తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబు కేసు వాయిదా పడినట్లు అయ్యింది. సుప్రీంకోర్టులో తర్వాత వర్కింగ్ డే ఆ రోజే.
అప్పటి వరకూ సుప్రీంకోర్టుకు సెలవులుఉన్నాయి. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన సమయంలో సీఐడీ తరపు లాయర్ రంజిత్ కుమార్ ఇప్పుడు వాదనలు వింటున్నారా అని సీజేఐని ప్రశ్నించారు. ఆ సమయంలో మీ వాదనలు కూడా వింటామని సీజేఐ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కేవియట్ దాఖలు చేసి.. తమ వాదనలు కూడా వినాలని కోరడంతో.. మూడో తేదీన సుదీర్ఘంగా వాదనలు సాగే అవకాశాలు ఉన్నాయి. కేవియట్ పిటిషన్ అంటే సెక్షన్ 148ఏ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పైన కోర్టులో అంటే ఏ కోర్టులో అయితే గెలుస్తారో ఆ పైన ఉండే కోర్టులో కేవియట్ పిటిషన్ వేస్తుంటారు. కేవియట్ అంటే కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కోర్టు ఆ కేసు ఏంటనేది వింటుంది. తదనుగుణంగా విచారణ చేసి ఇవ్వాల్సిన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది. కేవియట్ పిటిషన్ లైఫ్ 3 నెలలు ఉంటుంది. ఇలా కేవియట్ పిటిషన్‌ను ఉపయోగించుకోవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.స్కిల్ స్కామ్ లో టీటీడీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే హైకోర్టులో ఊరట లభించకపోవటంతో… సుుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అయితే ఇక్కడ కూడా వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసూ ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.త్వరలో చంద్రబాబు పిటిషన్ మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉండగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ తరపు వాదనలు కూడా వినాలని పిటిషన్ లో ప్రస్తావించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని తెలిపింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని… నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని… ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీనే అని చెప్పింది. ఈ కేసులో తమ తరపున వాదనలను వినిపిస్తామని కేవియట్ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది.