టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం నారా లోకేష్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అక్టోబరు 4వ తేదీ (బుధవారం) వరకు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దని నాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.స్కిల్, ఫైబర్ నెట్ కేసులో లోకేష్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టును ఆశ్రయించారు లోకేష్ తరఫు లాయర్లు. దీంతోపాటు ఫైబర్ నెట్ కేసులోను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. మరో వైపు.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది కోర్టు.బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు. విచారణకు సహకరించాలని లోకేష్‌కు కోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌కు 41A నోటీసులు ఇచ్చింది.. ఆ నోటీసులను ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. లోకేష్‌ను విచారించేందుకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలిపింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 గా ఉన్నారు నారా లోకేష్.
అంతకు ముందు ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఏపీ హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ14గా చేర్చిన నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్‌లో మార్పు చేశారని కోర్టుకు నివేదించారు. 41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని, విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని ఏజీ వివరించారు. దీంతో సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రాదు కాబట్టి ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. దీనినిబట్టి ముందస్తు బెయిల్‌కు ఆస్కారమున్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ఉండొచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. అసలు లోకేష్‌పై ఎఫ్ఐఆర్‌లో ఏ సెక్షన్లు పెట్టారు.. ఏ సెక్షన్లు తీసేశారు.. మళ్లీ ఏ సెక్షన్లు పెట్టారు అన్నది మొత్తం సస్పెన్స్ గానే ఉంది. ఎఫ్ఐఆర్‌లు కూడా లేకుండా అరెస్టులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా అదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతోన్నాయి. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ మొదటి నిందితుడిగా పేర్కొంది. బెయిల్ పిటిషన్‌పై ఈనెల 27న వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు. ఇవాళ వాయిదాల అనంతరం నాలుగో తేదీకి వాయిదా వేశారు. రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వాపరాలను కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని వివరించారు