singireddy
తెలంగాణ రాజకీయం

ఉప్పల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ ఎదురయింది.
ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష, ఆమె భర్త సింగిరెడ్డి  సోమశేఖర్ రెడ్డి గురువారం కెసిఆర్ సమక్షంలో ప్రగతిభవన్లో బి ఆర్ ఎస్ లో చేరుతున్నట్టు వెల్లడించారు.  
సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అనేవాడు నన్ను నమ్మించి తడి గుడ్డుతో గొంతుకోచాడని కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించే వరకు నిద్రపోనని నాకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని కానీ రేవంత్ నమ్మించి మోసడం చేయడంలో ముందుంటాడని ఆయనని మల్కాజ్గిరి ఎంపీ చేస్తే నన్ను ఎడారిలో వదిలేసిన వదిలేసాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం  కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఉప్పల్ నియోజకవర్గంలోని నా కార్యకర్తలతో కొడంగల్ లో రేవంత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నానని ఆయన తెలిపారు