ktr
జాతీయం రాజకీయం

సోషల్ మీడియా పై కారు గురి

సోషల్ మీడియాను సమర్ధంగా వాడుకుని… ప్రచారం చేసుకోవడం వల్లే నరేంద్రమోడీ ప్రధాని స్థాయికి ఎదిగారంటారు … ఇప్పుడు అదే రూటు ఫాలో అవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది… వాస్తవానికి 2014 ఎన్నికల తర్వాత సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరిగింది.. అందుకే హ్యాట్రిక్  విజయంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ ముఖ్యనేతలు .. సోషల్ మీడియా వినియోగంపై పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తూ… వారిని గైడ్ చేయడానికి ప్రతి నియోజక వర్గానికి వార్‌ రూమ్‌తో పాటు పర్యవేక్షణకు సెంట్రల్‌ వార్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తోంది…

గత దశాబ్దంగా ఎన్నికల ప్రచార ట్రెండ్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి … ప్రజలను నేరుగా కలిసి ప్రచారం చేయడంతో పాటు … సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగిపోయింది .. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు … ప్రసార, సోషల్ మీడియాలను విరివిగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ నేతలకు సూచిస్తున్నారు … ఓటర్లను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా పాత్రను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచార వ్యూహం రూపొందించుకోవాలంటున్నారు..

కేటీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు కూడా  ఎన్నికల ప్రచారం, సమన్వయం తదితర అంశాలపై గులాబీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు …. అందులో భాగంగా ప్రతి నియోజక వర్గానికి వార్‌ రూమ్‌తో పాటు పర్యవేక్షణకు సెంట్రల్‌ వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్… ఈ వార్‌ రూమ్‌లలో 380 మందికి పైగా పాలుపంచుకుంటున్నారు… సెంట్రల్‌ వార్‌ రూమ్‌ ద్వారా అందే సూచనలు, ఆదేశాలను క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా నియోజకవర్గ ఇన్‌చార్జిలు చర్యలు తీసుకోనున్నారు

స్పాట్

2014 ఎన్నికల తర్వాత సోషల్‌ మీడియా ప్రాధాన్యత పెరిగింది .. మోడీ కూడా సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రధాని స్థాయికి ఎదిగారన్నది కాదనలేని వాస్తవం … ఆ క్రమంలో వాట్సాప్‌తో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితరాలను ప్రచార వేదికలుగా ఉపయోగించుకోవాలని పార్టీ నేతలకు గులాబీ పెద్దలు సూచిస్తున్నారు.. విపక్ష పార్టీలు లేవనెత్తే  అంశాలు, చేసే విమర్శలపై స్థానికంగా ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు.

మేనిఫెస్టోపై విమర్శలను తిప్పికొట్టడంతో పాటు అందులోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామాల వారీగా వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని గైడ్ చేస్తున్నారు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతలు కొత్తరకం ఎన్నికల ప్రచార విధానాలకు అలవాటు పడాల్సిన అవసరం ఉందని … పార్టీ గుర్తును డీపీగా పెట్టుకోవడంతో పాటు చొక్కాలపై గుర్తును ధరించాలని  సూచనలు చేస్తున్నారు … అలాగే ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలతో బూత్‌ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు..

కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు .. పోలింగ్‌ ముగిసేంత వరకు పార్టీ నేతలు, కేడర్‌ కష్ట పడాలంటున్న బీఆర్ఎస్  ..  కాంగ్రెస్‌ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలని ఆదేశిస్తున్నారు … అవసరమైన సందర్భాల్లో పార్టీ నేతలు బాధ్యతలు అప్పగించిన చోట నిద్రించాలని… ప్రతి గడపను చేరుకునేలా ప్రచారం జరగాలని చెప్పుకొస్తున్నారు …. మొత్తానికి అటు జనానికి చేరువయ్యే పనిలో ఉంటూనే … సోషల్ మీడియాను కూడా సమర్ధంగా వాడుకోవడానికి స్కెచ్ గీసింది కారు పార్టీ….