రాజన్న సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ ఖాళీ అవుతుంది. సిరిసిల్ల బీజేపీలో రోజు రోజుకు అసంతృప్తులు జ్వాలలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ బీజేపీ బలపడుతూ వస్తుందిస్థానికులకే టికెట్ వస్తుందని అందరూ భావించారు. అయితే.. బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాణిరుద్రమకు టికెట్ కేటాయించడంతో.. స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో యేళ్లుగా పార్టీలో ఉన్న నేతలు కూడా.. బీజేపీకి రాజీనామా సమర్పిస్తున్నారు. ముఖ్యమైన నేతలందరూ పార్టీ వీడుతున్నారు. స్థానికులకు ఇస్తే.. కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని నేతలు నిలదీస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ, అధిష్టానం గుర్తించకపోవడంపై స్థానిక నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ సిరిసిల్ల నియోజకవర్గంలో అసంతృప్తులు ఏమాత్రం చల్లారడం లేదు. ఇక్కడంతా జరుగుతున్నా, అధిష్టానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే.. అనేక కేసులు పెట్టారని, ఇప్పుడు కొత్త వారికి టికెట్ ఎలా ఇస్తారని.. అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక పార్టీలో ఉన్న నేతలు సైతం ప్రచారంలో కలిసిరావడం లేదు. దీంతో… బీజేపీ ముఖ్య నేతలకు ఇబ్బందిగా మారింది. కొంత మంది నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను కలిసి తమ బాధను విన్నవించారు. అయినప్పటికీ.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. అందరిని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అసమ్మతి నేతలు మాత్రం ఎవరికైనా, స్థానికుడికి మాత్రమే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. పార్టీలో ఉండలేమని.. తేల్చి చెబుతున్నారు. సిరిసిల్ల బీజేపీలో రోజు రోజుకు అసంతృప్తులు జ్వాలలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ బీజేపీ బలపడుతూ వస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ కేవలం రెండు వేల మెజారిటీ మాత్రమే బీఆర్ఎస్ సాధించింది. తరువాత… జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఓటు శాతం పెంచుకుంది. ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లో.. మంచి ఓట్లను సాధించింది.
అయితే ఈసారి అసెంబ్లీ అనెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తామని నేతలు భావించారు.సిరిసిల్ల టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు బీజేపీ నేతలు పోటీ పడ్డారు. అయితే.. స్థానికులకు కాకుండా రాణిరుద్రమకు టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. దీంతో స్థానిక నేతలందరూ మూకుమ్మడిగా అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఆశించిన.. లగిశెట్టి శ్రీనివాస్. రమకాంత్, అన్నలదాసు వేణు, బీజేపీకి గుడ్‌బై చెప్పారు. రమాకాంత్, కేటిఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిపోయారు. అదే విధంగా… మిగతా నేతలు పార్టీలో ఉన్నా సైలెంట్ అయ్యారు. ముఖ్యమైన కేడర్ కూడా సామూహికంగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు.మంత్రి కేటీఆర్‌ను ఎదుర్కోవడానికి రాణిరుద్రమను బరిలోకి దింపుతే.. ఇక్కడ మాత్రం.. అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. పార్టీలో పని చేసిన వారిని అన్యాయం జరిగిందని సిరిసిల్ల బీజేపీ నేతలు చెబుతున్నారు.
సిరిసిల్లతో సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ,ప్రశ్నిస్తున్నారు.. అందు కోసమే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నామని స్థానిక నేతలు ప్రకటించారు. ఇదిలావుంటే పార్టీలో ఉన్న చిన్న, చిన్న పొరపాట్లను త్వరలో సరిదిద్దుకుంటామని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ అంటున్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. చూడాలని ఎన్నికల నాటికన్న అసంతృప్తు దారికి వస్తారో లేదో.