నిజామాబాద్ అర్బన్ రోడ్ షో లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… గులాబీ జెండా రాకముందు ఎలా ఉండే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని, నాడు నీళ్ళ కోసం ఎంతో గోస. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రేషన్ షాపుల ద్వారా పాత బియ్యం, సన్నబియ్యం ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు. మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం అమలు చేయబోతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ వాళ్ళు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా? అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే మళ్లీ 400 లకే సిలిండర్ ఇవ్వ్వబోతున్నామని హరీష్ రావు వెల్లడించారు. రైతు బీమా లాగా కోటి కుటుంబాలకు 5 లక్షల బీమా అందించబోతున్నామని, కేసీఆర్ రాకముందు నిజామాబాద్ ఎంత మారిందన్నారు మంత్రి హరీష్ రావు.రఘునాథ్ చెరువు అద్భుతంగా అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ ఉన్న నాడు ఇన్వర్టర్స్, కన్వర్టర్ అని ఆయన ఎద్దేవా చేశారు.
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినంక బొడి మల్లన్న అన్నట్టుందని, నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారన్నారు. ఆపద మొక్కులు మొక్కుతున్నారని, ఓట్లు డబ్బాలో పడితే ఎగవెట్టేందుకు చూస్తున్నారన్నారు. కేసీఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం. లేదంటే అందరం బాధ పడతామన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ కాకమ్మ కథలు నమ్మొద్దు. మోస పోతామని, భూతు మాటల నాయకులకు, భుతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అని ఆయన అన్నారు. షబ్బీర్ అలీ కామారెడ్డి లో గెలవలేదు, ఎల్లారెడ్డిలో గెలవలేదు. ఇక్కడకు వచ్చిండన్నారు. అక్కడ చెల్లని షబ్బీర్ అలీ ఇక్కడ ఎలా చెల్లుతాడని హరీష్ రావు అన్నారు.