ఏపీ మంత్రి ఆర్కే రోజా న్యాయపోరాటానికి దిగారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న నాయకులు, జర్నలిస్టులపై ఏకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ రోజా న్యాయపోరాటానికి దిగడం విశేషం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నగిరి టిడిపి ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్, మరో ఎల్లో మీడియా జర్నలిస్టుపై నగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.కొద్దిరోజుల కిందట మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై వ్యక్తిగత కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీసాయి.పలువురు రాజకీయ,సినీ ప్రముఖుల సైతం స్పందించారు. ఏపీ పోలీసుల స్పందించి బండారు సత్యనారాయణమూర్తి పై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే అప్పట్లో బండారు సత్యనారాయణమూర్తికి బెయిల్ లభించింది. ఆ సందర్భంలో మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఏకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం.మంత్రి రోజాపై బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానిని బలపరుస్తూ ఇల్లు మీడియా జర్నలిస్టు సైతం అదే రకమైన కామెంట్స్ చేయడం అప్పట్లో పెను దుమారానికి దారితీసింది. ఒక పద్ధతి ప్రకారం రోజాను నియంత్రించడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. అందుకే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కోర్టుకీడ్చి.. చట్ట ప్రకారం శిక్ష పడే వరకు విశ్రమించనని రోజా హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. తనపై కామెంట్స్ చేసే వారికి గట్టి హెచ్చరికలే పంపారు.రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరిలోని కోర్టులో క్రిమినల్ డెఫిమేషన్ పిటిషన్ వేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని.. పరువుకు భంగం కలిగేలా మాట్లాడరని పిటిషన్లు పేర్కొన్నారు. కోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది.
అయితే కేవలం ముగ్గురిపైనేఆమె పిటిషన్ దాఖలు చేయడం విశేషం.అయితే ఇదే సమయంలో రోజా రాజకీయ ప్రత్యర్థులపై చేసిన విమర్శల మాటేమిటి అన్న ప్రశ్న టిడిపి, జనసేన శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై చాలా రకాల వ్యాఖ్యలు చేశారని.. వాటి మాటేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే రోజా పరువు నష్టం దావా పిటీషన్ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.