ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన పాకిస్థాన్ ఉగ్రవాది క్వారి.. ఇవాళ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఆ ఉగ్రవాది స్నైపర్‌గా కూడా శిక్షణ పొందాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో అతను స్నైపర్‌గా శిక్షణ తీసుకున్నాడు. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌లో అతను తన కార్యకలాపాలను సాగించాడు. అయితే ఇవాళ రాజౌరీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతను హతమయ్యాడు. దంగ్రీలో జరిగిన దాడులకు అతనే మాస్టర్‌మైండ్ అని తేలింది.దంగ్రీలో జరిగిన కాల్పుల్లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంట్లో ఇద్దరు కెప్టెన్లు కూడా ఉన్నారు. ఇవాళ ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదిని క్వారిగా గుర్తించారు.
అతను పాక్ జాతీయుడని జమ్మూ డిఫెన్స్ ప్రతినిధి తెలిపారు. గత ఏడాది నుంచి రాజౌరీ-పూంచ్ ప్రాంతాల్లో అతను యాక్టివ్‌గా ఉన్నాడు. దంగ్రీ, కండి దాడులకు అతనే కీలక వ్యక్తి అని విశ్వసిస్తున్నారు.రాజౌరీ ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాదానికి జీవం పోసేందుకు అతన్ని అక్కడకు పంపినట్లు తెలుస్తోందని ప్రతినిధి తెలిపారు. ఐఈడీ బాంబులను పేల్చడంలో అతను నిష్ణాతుడు. గుహల్లో దాక్కుని ఐఈడీలను అతను ఆపరేట్ చేస్తుంటాడు. స్నైపర్‌గా కూడా శిక్షణ పొందాడు.