adluri laxman-wife
తెలంగాణ రాజకీయం

అన్ని వర్గాలకు టోపి పెట్టిన కేసీఆర్ సర్కార్

అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలు, దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వకుండా అన్నివర్గాలకు టోపి పెట్టారని ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భార్య కాంతకుమారి ప్రభుత్వ తీరును విమర్శించారు.
సోమవారం కాంతకుమారి పెగడపల్లి మండలం బతికేపల్లి, గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈసందర్బంగా బతికేపల్లి ,గొల్లపల్లి లో కాంతకుమారి మాట్లాడుతూ 1,200 మంది బళీధనాలకు చలించిన సోనియాగాంధీ తెలంగాణా ఇచ్చిందని, తెలంగాణ ఇచ్చిన పార్టీని గెలిపించుకుందామని బతికేపల్లిలో పెద్ద సంఖ్యలో   హాజరైన మహిళలతో కాంతకుమారి అనిపించారు. కేసీఆర్ దొరల పాలనకు చరమగీతం పాడలని కాంతకుమారి పిలుపునిచ్చారు.  ధర్మపురిలో ధనవంతుడైన మంత్రి కొప్పుల ఈశ్వర్, పేదవాడైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల మధ్య ధర్మపురిలో మరోసారి యుద్ధం జరుగుతుందని ఇయుద్ధంలో అడబిడ్డలు ఆశీర్వదిస్తే లక్ష్మణ్ కుమార్ గెలుస్తాడని ,ధోరలను ఓడించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెసు గెలిస్తే కరెంట్ ఉండదని
బిఆర్ఎస్ నాయకులు మోసపూరిత మాటలు చెబుతున్నారని,  24 గంటలు కరెంట్ ఇస్తామని 500 రూపాయల బాండ్ పేపర్ తీసుకువచ్చి మీరు పెట్టిన తర్వాత కాంగ్రెస్ నాయకులం కూడా సంతకం పెడతామని దీనికి మీరు సిద్ధమా అని కాంతకుమారి సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వానికి బడులు వద్దు బార్ షాపులు ముద్దు అన్న చందంగా గ్రామ, గ్రామన బెల్ట్ షాపులు పెట్టి తాగుబోతుల తెలంగాణా చేశాడని ఆరోపించారు.2018 లో    కేసీఆర్ దొరగారి ఆదేశాలతో అధికారులు గెలిచిన లక్ష్మణ్ కుమార్ ను కాదని మొసంచేసి   కొప్పుల ఈశ్వర్ ధోరను గెలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ కుమార్ డబ్బులు సంపాదించడానికి ఎన్నికల్లో నిలబడలేదని ప్రజాసేవ చేయడానికేనని , ఎన్నికల ఖర్చుల కోసం ఇళ్ళు, బంగారం కుడువబెట్టామని , మా దగ్గర డబ్భులు లేవని చెబుతూ ఈసారి లక్ష్మణ్ కుమార్ ను గెలిపించాలని బతికేపల్లిలో కాంతకుమారి కంట నీరు పెడుతూ కొంగు చాచి ఓట్లు అభ్యర్థించారు.
ధర్మపురి ధర్మానికి నిలయమని ఈసారి ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి మాట్లాడుతూ నేను కాంగ్రెసు పార్టీ సర్పంచ్ అయినందున మంత్రి కొప్పుల ఈశ్వర్ కక్ష కట్టి గ్రామానికి అభివృద్ధి నిధులు ఇవ్వకుండా గ్రామాభివృద్ధిని అడ్డుకున్నాడని మంత్రిపై నిప్పులు చెరిగారు.10 ఏళ్ళు నమ్మి మోసపోయి గోసపడ్డాం  ఇక బి ఆర్ ఎస్ పార్టీని రాష్ట్రంలో బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలు బతుకమ్మ అడగా, పులి వేషాలు ప్రచారంలో ఆకర్షణగా నిలిచాయి.
సమావేశంలో  ఎంపిటిసి లచ్చయ్య, నాయకులు కృష్ణహరి,తాటిపర్తి  ప్రభాకర్ రెడ్డి, సుధీర్, మమత రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాములు గౌడ్, కస్తూరి శ్రీనివాస్, శేఖర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.