తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మేధావులు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించు కునేందుకు పౌరులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే, ఓటర్లకు ముఖ్య గమనిక. ఓటు వేసే వారు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.ముందుగా ఓటర్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది? అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లోనే ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది.
అందుకే, పోలింగ్ బూత్ ఎక్కడుంది అనేది తెలుసుకోవడం అవసరం. చేతిలో కేవలం ఓటర్ కార్డు ఉంటే సరిపోదు. ఓటర్ కార్డు ఉంది ఇక ఓటు వేసేయొచ్చు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు. కచ్చితంగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే మీ పోలింగ్ బూత్ ఏదో తెలుసుకోవాల్సిందే.