kcr
తెలంగాణ రాజకీయం

ఎవరు ఎక్కడ ఓటు వేశారో…

తెలంగాణ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన స్వగ్రామం చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ కూడా వచ్చారు. ఆమె కూడా అదే కేంద్రంలో తన ఓటు వేశారు. సీఎం కేసీఆర్ దంపతుల వెంట మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. కొడంగల్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సతీసమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో ఓటేశారు. ఖమ్మం జిల్లా మధిరలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో సతీసమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు మంత్రి హరీష్‌రావు.
హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ హైదరాబాద్‌ రామ్‌నగర్‌లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కూడ ఓటు హక్క ఉపయోగించుకున్నారు. ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌లో ఓటు వేశారు.
జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరిలోని 265 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సూర్యాపేటలోని చైతన్య స్కూల్‌లో కుటుంబ సమేతంగా ఓటేశారు మంత్రి జగదీశ్ రెడ్డి.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీమంత్రి దామోదర్ రెడ్డి సూర్యపేటలో ఓటు వేశారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓటువేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. తార్నాకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి రాంచందర్ రావు.
కూకట్‌పల్లి నియోజకవర్గం శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కును వినియోగించుకున్నారు బిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు. కుటుంబ సమేతంగా వచ్చి తమఓటు హక్కు వినియోగించుకున్నారు శేరిలింగంపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ.
కాగా.. తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం..51.89 నమోదైంది. హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది.