jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పక్కా ప్లాన్ తో జగన్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. జగన్ వైఫల్యాలపై టిడిపి, జనసేన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ఇవి సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నాయి.అయితే దీనికి విరుగుడుగా జగన్ సైతం కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాలను చెక్ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు విడమరిచి చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రజాపయోగ పనులకు పెద్దపీట వేస్తున్నారు.గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో విధ్వంసకర పాలన సాగిందని.. సంక్షేమంటున్నా పెద్ద ఎత్తున లూటీ జరిగిందని.. అభివృద్ధి అన్నది లేకుండా పోయిందని.. అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబుతో పాటు పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. దీనికి తోడు ప్రజా వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించింది. ఉద్యోగం, ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యతిరేకత వెలుగు చూస్తోంది. ఈ పరిణామాల క్రమంలో జగన్ పై ఒక రకమైన ఒత్తిడి ప్రారంభమైంది. అందుకే 2014, 2019లో మధ్య టిడిపి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు, చేపట్టిన పనులు గురించి ఇప్పుడు జగన్ ప్రస్తావించడం ప్రారంభించారు.

నాటి వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారుఈనెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ఉద్దానం ప్రాంతంలో కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అదే వేదిక పైనుంచి విపక్షాలను సవాల్ చేయనున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉద్దానం కిడ్నీ వ్యాధులతో సతమవుతమవుతోంది. ముఖ్యంగా పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో జనాభాలో సగానికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉన్నారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వ హయాంలో జనసేన అధినేత పవన్ కిడ్నీ వ్యాధుల తీవ్రత పై ఫోకస్ పెట్టారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచారు. ఉద్దానం వాసులకు శుద్ధ జలాలు, వైద్య సేవలు, వ్యాధి మూలాలు వంటి వాటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కొన్ని రకాల విజ్ఞప్తులు చేశారు. కానీ అప్పట్లో కొన్ని అంశాలపై చంద్రబాబు ముందడుగు వేయగలిగారు. కానీ శాశ్వత పరిష్కారం చూపలేదు.కిడ్నీ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పలాస, ఇచ్చాపురం నియోజకవర్గం భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితికి కారణమని ఒక అనుమానం ఉంది.

ఈ నేపథ్యంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని తెప్పించి.. శుద్ధ జలాలుగా మార్చి తాగునీరు అందించాలని జగన్ నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 700 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి ప్రాజెక్టు పేరుతో 2019 సెప్టెంబర్ 6న శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వాటి పనులు పూర్తయ్యాయి. ఈనెల 14న ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. మీరు చేయలేని పనులు.. చూపించలేని పరిష్కారం.. తాను చేసి చూపించానని జగన్ సవాల్ విసిరే అవకాశం ఉంది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు ఆసుపత్రిని కూడా జగన్ ప్రారంభించనున్నారు. ఎన్నికల ముంగిట భారీ ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్న వేళ విపక్షాలకు ఇదో సవాలే. అధికార పక్షానికి ఇది ఒక ప్రచార అస్త్రం గా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు