auto dharna-mahalaxmi
తెలంగాణ రాజకీయం

మా బతుకులు రోడ్డున పడ్డాయి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం తర్వాత అమలులోకి వచ్చిన మహాలక్ష్మి పథకం తో మా బతుకులు రోడ్డు మీద పడ్డాయని మినీ ఆటోలు, టాటా మ్యాజిక్ లు యజమానులు ఆవేదనతో ధర్నాకు దిగారు. కడెం మండల కేంద్రంలో మండల ఆటో,టాటా మ్యాజిక్ యూనియన్ల ఆధ్వర్యంలో డ్రైవర్లు,ఓనర్లు ప్రధాన రహదారిపై బైఠాయించి మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేసారు.  ఈ సందర్భంగా ఆటో యూనియన్ యజమానులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇవ్వడంతో మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. అందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్ల మా ఆటో గాని టాటా మ్యాజిక్ లో గాని ఎవరు ప్రయాణించడం లేదని దీంతో మా జీవితాలు సాగడం కష్టమవుతుందని , మేము ఫైనాన్సు తీసుకున్న ఆటో లకు డబ్బులు చెల్లించడం కష్టమవుతుంది.

అంతేకాకుండా మా పిల్లలకు  స్కూల్ ఫీజు కట్టడానికి చదివించుకోవదానికి మాకు చాలా భారమైతుంది. ఇకనైనా ప్రభుత్వం కొన్ని షరతులతో ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఉచితంగా ఇవ్వాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు టాక్సీలు మరియు టాటా మ్యాజిక్ యజమాని యూనియన్ అందరూ పెద్దఎత్తున ధర్నాలు రాస్తారోకో నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.