ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.విశాఖ జిల్లాలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లుపై టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వ హించారు.20వ తేదీన పోలిపల్లి గ్రామంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంద ని,ఆ సభకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ పాల్గొంటారని,ఈ సభకి రాష్ట్రం నలు మూలల నుంచి లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారని,ఈ సభకి 16 కమిటీలు ఏర్పాటు చేశా మని తెలిపారు.
ఈ సభకి 6 లక్షలు మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామని,వైసీపీ కౌట్ డౌన్ ప్రారంభమైందని,వైసీపీలోని అనేకమంది టీడీపీ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని అన్నారు. త్వరలో పూర్తి మ్యానిఫెస్టో సిద్ధమైన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యలో భారీ సభ నిర్వహిస్తామని,జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అచ్చె న్నాయుడు ఎద్దేవ చేశారు.