davud ibrahim
జాతీయం రాజకీయం

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం?

ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జ‌రిగింది. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించిన‌ట్లు.. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న అతడు ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు ప్ర‌ముఖ‌ ఆంగ్ల న్యూస్ వెబ్‌సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే అత‌డు ఏ హాస్పిటలో చికిత్స పొందుతున్నాడనే విషయం బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు దావుద్‌పై విష ప్ర‌యోగం చేసింది ఎవరని అతని సిబ్బంది ముమ్మరంగా గాలిస్తుంది.దావుద్ ఇబ్రహీం ప్ర‌స్తుతం పాకిస్తాన్‌లో నివ‌సిస్తున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్‌ పఠాన్‌ మహిళను రెండో పెళ్లి చేసుకున్న దావూద్ గ‌త కొంతకాలంగా కరాచీలోనే నివసిస్తున్నాడు.1993 ముంబై పేలుళ్ల త‌ర్వాత ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్‌గా దావూద్ ఇబ్ర‌హీంపై ముద్ర ప‌డింది.

2003లో అమెరికా కూడా అత‌న్ని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించింది. గ‌తేడాది త‌మ భూభాగంలోని 88 ఉగ్ర‌వాద సంస్థ‌ల‌పై ఆంక్ష‌లు విధించిన సంద‌ర్భంగా తొలిసారి దావూద్ త‌మ ద‌గ్గ‌రే ఉన్నాడ‌ని పాక్ అంగీక‌రించింది. అత‌న్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని ఎన్నోసార్లు ఇండియా డిమాండ్ చేసినా పాక్ వినిపించుకోలేదు. ఇక అత‌డి కోసం ఇండియానే కాకుండా ప్ర‌స్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు వెదుకుతున్నాయి.