prajavani
తెలంగాణ రాజకీయం

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం రోజున ఐడీవోసీ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకొని సాధ్యాసాధ్యాల మేరకు అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రజావాణి కి వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణిలో 17 అర్జీలు పలు సమస్యలపై రావడం జరిగిందని, భూ సమస్యలు, ప్రభుత్వ పనులు, వ్యక్తిగత సమస్యలపై అర్జీలు రావడం జరిగాయని తెలిపారు.  ఆనంతరం  రాష్ట్ర ముఖ్య మంత్రి ఈ నెల 21 న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించనున్న సమావేశ మునకు సంబంధించిన విషయాలపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఇప్పటి వరకు వివిధ పద్దుల క్రింద మంజూరు అయిన పనులు, కావలసిన నిధులు, పనుల పురోగతీ వంటి వివరాలను అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు.

ధరణీ,  ప్రభుత్వ భూములు, కౌలు రైతులు, పరిపాలన అంశాల వివరాలు కూడా సమర్పించాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వసతి సౌకర్యాలు, రబీ, యాసంగి పంటలకు సాగునీరు, మహాలక్ష్మి పథకం అమలు, వంటి వివరాలను సంక్షిప్తంగా సమర్పించాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీఓ లు నరసింహ మూర్తి, రాజేశ్వర్, మధు, ఎస్.డి.సి. శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.