salaar
తెలంగాణ

దుమ్మురేపుతున్న సలార్

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమాకు బెనిఫిట్ షో నుండే పాజిటివ్ టాక్ లభిస్తోంది. ప్రభాస్ కటౌట్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ కరెక్ట్‌గా ఉపయోగించుకున్నాడని, యాక్షన్ సీన్స్‌లో ఈ హీరో అదరగొట్టాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా మొదటిరోజే ఎన్నో రికార్డులను బద్దలగొట్టింది. పలు హిట్ సినిమాలను వెనక్కి తోసి మొదటిరోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘సలార్’ నిలిచింది. ఈ ఏడాది విడుదలయిన అన్ని సినిమాల్లో ‘సలార్’ డే 1 కలెక్షన్సే అత్యధికంగా వసూళయ్యాయి.
పాజిటివ్ టాక్‌తో రికార్డ్స్ బ్రేక్..
బాక్సాఫీస్ దగ్గర ‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’ డే 1 ఓపెనింగ్ గురించి ఫ్యాన్స్ చాలాకాలం మాట్లాడుకుంటారు. ఎందుకంటే మూవీ ఆ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, శృతిహాసన్ లీడ్ రోల్స్‌లో నటించారు. 2023లో విడుదలయిన అన్ని సినిమాల్లో మొదటిరోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా ‘యానిమల్’, ‘జవాన్’, ‘పఠాన్’ నిలిచాయి. ఇప్పుడు ఏకంగా ఆ మూడు సినిమాను దాటి ‘సలార్’ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ఇప్పటికే ‘సలార్’ పాజిటిక్ టాక్‌తో దూసుకుపోతుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు బ్రేక్ చేస్తున్నందుకు వారు డబుల్ సంతోషంలో మునిగిపోయారు. ‘డంకీ’ రిలీజ్ వల్ల తక్కువ స్క్రీన్స్ లభించినా ఈ రికార్డు సాధించడమంటే గ్రేటే.
దేశవ్యాప్తంగా ఓపెనింగ్ డే కలెక్షన్స్..
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయాయి. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే ఉన్నాయి. దీంతో మొదటిరోజే ఈ సినిమా చూడాలని చాలామంది ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎగబడ్డారు. దానివల్ల ప్రీ బుకింగ్, ఫస్ట్ డే కలెక్షన్స్‌పై పాజిటివ్ ప్రభావం పడిందని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు. సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ‘సలార్’ దేశవ్యాప్తంగా ఓపెనింగ్ రోజే రూ.95 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ మూవీ కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓపెనింగ్ రోజే రూ.70 కోట్లను కలెక్ట్ చేసింది ‘సలార్’. మొదటిరోజే సినిమా చూడడం కోసం ఫ్యాన్స్ అంతా ముందుకు రాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు దాదాపు 88.93 శాతం నిండిపోయాయి.
ఇతర రాష్ట్రాల్లో కూడా..
రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ‘సలార్’ ఓపెనింగ్ డే కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కర్ణాటకలో రూ.12 కోట్లు, కేరళలో రూ.5 కోట్లు కలెక్షన్స్‌ను రికార్డ్ చేసుకుంది ఈ మూవీ. ఇక ‘సలార్’ బ్రేక్ చేసిన రికార్డుల విషయానికొస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ ఇండియాలో రూ.57 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ఆ తర్వాత ఆయన హీరోగా తెరకెక్కిన మరో చిత్రం ‘జవాన్’ అయితే ఏకంగా రూ.75 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ ‘యానిమల్’ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రూ.63 కోట్లు. ఇప్పుడు ఈ మూవీ సినిమాలను బీట్ చేసి ‘సలార్’ ఏకంగా రూ.95 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్‌ను సాధించింది. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో రికార్డును ఒక రేంజ్‌లో సెట్ చేశాడు ప్రభాస్. ఈ సంఖ్యను అందుకోవడం ఇతర హీరోలకు కొంచెం కష్టమే