christmas-visaka
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

వైభవంగా విశాఖలో క్రిస్తుమస్

దేశంలో క్రిస్మస్ సందడి రాత్రి నుంచే మెుదలైంది. వివిధ ప్రాం తాల్లో క్రైస్తవ సోదరులు చర్చిలకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్  దీపాలతో అలంక రించారు.పలు చర్చిలో ప్రార్థనలు అ త్యంత ఘనంగా నిర్వహించారు. ఆం గ్లో ఇండియన్ సంస్కృతి విరాజిల్లే విశాఖలో పురాతన చర్చిలను విద్యు త్ దీపాలతో ముస్తాబు చేశారు. క్రిస్మస్ పండుగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీప కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి.చర్చిలలో యేసు జన్మదినాన్ని స్వాగతం పలుకుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలు అంతా సంతోషంగా, ప్రేమా నురాగా లతో ఉండాలని ప్రభువును స్తుతిం చారు.ప్రార్ధనలు చేసిన అనంతరం బాల ఏసును దర్శిం చుకొని ఏసుక్రీస్తు సువార్తలతో ఆనందంగా గడిపారు.