new year-traffic
తెలంగాణ ముఖ్యాంశాలు

న్యూ ఇయర్ ఆంక్షలు..ఇవే

నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు… ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గదర్శకాలను వాహనదారులు, ప్రజలు పాటించాలని కోరారు.నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు.
PVNR ఎక్స్ ప్రెస్ వే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు.
శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్, షేక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, దుర్గంచెరువు ఫ్లైఓవర్,సైబర్ టవర్ ఫ్లైఓవర్, బాబు జగ్జీవన్ ఫ్లైఓవర్ లు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు.
క్యాబ్ డ్రైవర్లకు పోలీసుల సూచనలు
క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలి.
ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు చార్జీలు వసూలు చేయకూడదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబ్ డ్రైవర్లు రైడ్ ను క్యాన్సిల్ చేయకూడదు. అది మోటార్ వెహికల్ చట్టం-1988 సెక్షన్ 178 చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తారు.
బార్, పబ్ లకు పోలీస్ సూచనలు
ఏదైనా బార్, పబ్, క్లబ్ లలో మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలను నడపటానికి అనుమతిస్తే నేరాన్ని ప్రోత్సహించినందుకు చర్యలు తీసుకుంటారు.
తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై కస్టమర్లకు సంబంధిత పబ్, క్లబ్, బార్ లు అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించిన వారి ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
ప్రజలు, వాహనదారులకు పోలీస్ సూచనలు
ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు
సైబరాబాద్ పరిధిలోని అన్నీ రహదారులపై రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పై విస్తృత తనిఖీల నిర్వహణ
వాహనదారులు సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించడంతో పాటు పత్రాలను చూపించడం వాహన డ్రైవర్లు విధి. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
పబ్లిక్ రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా, బాధ్యతగా వాహనాలు నడపాలి