revanth-daavos
తెలంగాణ రాజకీయం

జనవరిలో దావోస్ కు రేవంత్

 రేవంత్ తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ఖరారైంది. జనవరిలో స్విట్జర్లాండ్ వేదికగా జరిగినే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్ లో పాల్గొనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారుస్విట్జర్లాండ్ వేదికగా జనవరి లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్ జరగనుంది.జనవరి 15 – 19 వరకు……5 రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది.ఈ సమ్మిట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎంతో పాటు ఐటి శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, ప్రత్యేక చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ సీఎం వెంట స్విట్జర్లాండ్ వెళ్లనున్నారుఈ సమావేశాలకు షెడ్యూల్ ప్రకారం అయితే…..సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీం జనవరి 15న ఉదయం బయల్దేరి….18వ తేదీన సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు.ఇక గత ఏడాది జరిగిన సమ్మిట్ కు అప్పటి మంత్రి కేటీఆర్ మరియు బృందం వెళ్ళారు.దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తెచ్చామని అప్పటి మంత్రి కేటీఆర్ పలు మార్లు వెల్లడించారు.విదేశీ కంపెనీలు తెలంగాణలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి ఇన్వెస్ట్మెంట్ లు పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో చర్చలు జరపనుంది.

ఐటి,ఫార్మా,బయో,ఏరోసిస్,మ్యానుఫ్యాచరింగ్,సర్వీస్ రంగాల్లో అనుసరిస్తున్న విధానాలు,విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలను వివరించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడడం తో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.ఇక దావోస్ సమ్మిట్ థీమ్,అజెండా అంశాలను ఐటి మంత్రి శ్రీధర్ బాబు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవ్వనున్న రాయితీలు, కల్పించనున్న సౌకర్యాలు ఆయా కంపెనీల ప్రతినిధులకు సీఎం రేవంత్ బృందం వివరిస్తారు.