వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంపై దాడులను ఖండించారు విడదల రజనీ. ఇలాంటి చర్యలకు పాల్పడటంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ వేడులను సాధారణంగా జరుపుకోకుండా పధకం ప్రకారమే దాడి చేశారని అరోపించారు. డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తోందని వివరించారు మంత్రి రజినీ. ఈ రోడ్డుపై ఇలాంటి రాళ్లు ఎక్కడా లేవన్నారు. వీటిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి తాము కొత్తగా నిర్మించిన పార్టీ ఆఫీసుపై విసిరారన్నారువైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంపై దాడులను ఖండించారు విడదల రజనీ. ఇలాంటి చర్యలకు పాల్పడటంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ వేడులను సాధారణంగా జరుపుకోకుండా పధకం ప్రకారమే దాడి చేశారని అరోపించారు. డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తోందని వివరించారు మంత్రి రజినీ. ఈ రోడ్డుపై ఇలాంటి రాళ్లు ఎక్కడా లేవన్నారు. వీటిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి తాము కొత్తగా నిర్మించిన పార్టీ ఆఫీసుపై విసిరారన్నారు.
కొత్త ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లేకపోతే పూర్తి స్థాయిలో అద్దాలు ధ్వంసం అయ్యేవని వివరించారు. చంద్రబాబుకు బీసీ సామాజిక వర్గం పట్ల ఎప్పుడూ చిత్తశుద్ది లేదని విమర్శించారు.వందల మంది పార్టీ ఆఫీసు ముందు గుమిగూడి రాళ్లు రువ్వినట్లు తెలిపారు. ఈ దాడివెనుక ఎవరున్నారన్నది విచారణలో తేలుతుందన్నారు. వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. బీసీ మహిళగా కొత్తగా నిర్మించుకున్న పార్టీ ఆఫీసును న్యూఇయర్ సందర్భంగా ప్రారంభించుకోవాలని అనుకుంటే.. దానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకున్నందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోందన్నారు. అధికార దాహం కోసం గూంఢాలను పురమాయించి ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడే వారిని గుంటూరు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు