కొత్త సంవత్సరం వేళ.. జపాన్ ను భారీ భూకంపం వణికించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం 7.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇషికావాలో సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెదర్ ఏజెన్సీ తన వార్నింగ్‌లో తెలిపింది. హొక్కియాడా నుంచి నాగసాకి మధ్య జపాన్ సముద్రతీరం వెంట సుమారు మూడు మీటర్ల ఎత్తులో సునామీ అలలు వచ్చే అకాశాలు ఉన్నాయి. భారీ భూకంపం నేపథ్యంలో ఉత్తర కొరియా రష్యాల కు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలకూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది.