పెన్షనర్ల,సీనియర్ సిటీజేన్స్ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు.సోమవారం నూతన సంవత్సరం 2024 సందర్భంగా తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్, తెలంగాణ పెన్షనర్స్ అస్సోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖల రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛాలు తమ అస్సోసియేషన్స్ తరపున అందించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో పెన్షనర్స్, సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ల తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పెన్షనర్స్, తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అస్సోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టీ విశ్వనాతం,కోశాధికారి వి.ప్రకాష్, అసోసియేట్ అధ్యక్షుడు ,కాన్పిలియేషన్ అధికారి పి.హన్మంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,నాయకులు దేవేందర్ రావు,నారాయణ,ఎం.డి.ఎక్బాల్,హన్మాండ్లు, సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్ప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.