టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ తీర్మానం చేసింది. గతంలో ఇంధిరా గాంధీ మాదిరిగా ఈసారి సోనియా గాంధీని కూడా దక్షిణాది నుంచి పోటీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ నుంచి సోనియాగాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ తో రాష్ట్రంలో మరిన్ని ఎంపీ సీట్లు గెలవొచ్చని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. సోనియా ఎఫెక్ట్ ఒక్క తెలంగాణలోనే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాలపైనా ఉంటుందంటున్నారు. అందుకోసం.. నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దీంతో సోనియా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.సోనియాగాంధీ తెలంగాణలో పోటీ చేస్తే.. ఫస్ట్ ఆప్షన్ మల్కాజిగిరి ఉండే చాన్స్ లేకపోలేదు. మల్కాజ్‌గిరి ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం.. 2019 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇక్కడ నుంచి గెలిచారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండడం.. మరోవైపు రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ సోనియా గెలుపునకు సునాయాసమని చెబుతున్నారు.
దీనికి తోడు మల్కాజ్‌గిరి మిని ఇండియా కావడంతో సోనియా ఇక్కడ నుంచి పోటీ చేయాలని సూచిస్తుంది టీపీసీసీ. ఇక రెండో ఆప్షన్ మెదక్ నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచే ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు సోనియాని మెదక్ నుంచి బరిలో దింపితే ఈజీగా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్‌లో ప్రచారం చేయకపోయినా.. ఇందిరాగాంధీ గెలిచారు. ఇందిరను ఓడించడమే లక్ష్యంగా పది మంది హేమాహేమీలు బరిలో దిగారు. అయినా మెదక్ ప్రజలు ఇందిరకు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 2 లక్షల పైచిలుకు మెజార్టీని కట్టబెట్టారు. అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 41 ఎంపీ స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. షో మెదక్ నుంచి తిరిగి సోనియా గాంధీని నిలబెట్టి.. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలవాలనుకుంటోంది కాంగ్రెస్.ఇవి రెండు కాకపోతే కరీంనగర్‌ను చూపిస్తోంది రాష్ట్ర కాంగ్రెస్. తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్‌కు సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సోనియా కరీంనగర్ నుంచే మాట్లాడారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు, తెలంగాణ ఇచ్చిన లీడర్‌గా సోనియాగాంధీకి పేరుంది కనుక కరీంనగర్ నుంచి పోటీ చేసినా సోనియా గాంధీ వీజిగా విన్ అవుతారని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. దక్షిణ తెలంగాణపై మరింత పట్టు సాధించాలంటే అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఎంట్రీతోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అందుకే, కరీంనగర్ కూడా రాష్ట్ర నాయకత్వం జాబితాలో ఉంది.సోనియా గాంధీ కోసం పరిశీలనలో ఉన్న మరో నియోజకవర్గం చేవెళ్ల. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలం, బలగం మొండుగా ఉంది. దీంట్లో హైదరాబాద్‌లోని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉండడం.. పైగా చేవెళ్ల ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్. సోనియా గాంధీ గనక చేవెళ్ల నుంచి పోటీ చేస్తే.. మళ్లీ సెంటిమెంట్ పునరావృతం అవుతుందని చెబుతున్నారు. పైగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు.
బహుశా.. సోనియా గాంధీని చేవెళ్ల బరిలో దించే ఉద్దేశంతోనే ముందుగా ఈ నియోజకవర్గ బాధ్యతను సీఎం రేవంత్‌కు అప్పగించారనే టాక్ నడుస్తోంది. సోనియా గాంధీ గనక తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఆ నియోజవకవర్గాల లిస్టులో చేవెళ్లను కూడా చేర్చి చెబుతున్నారు. అయితే టీపీసీసీ తీర్మానాన్ని ఇశాళ ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ ఏఐసీసీ ముందు ఉంచనున్నారు. ఏఐసీసీ గనుక ఓకే చెబితే మాత్రం సోనియా పోటీకి రంగం సిద్ధం చేయనుంది తెలంగాణ కాంగ్రెస్.