టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. టిడిపి నేతలు రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య,తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం నందు భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు షేక్.అబ్ధుల్ అజీజ్ , కోటంరెడ్డి గిరిధర్ , చెంచల బాబు యాదవ్, బొమ్మి సురేంద్ర ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం లో జిల్లా వ్యాప్తంగా టిడిపి నేతలు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జన్మదిన వేడుకలకు హాజరైన టిడిపి నాయకులకు, కార్యకర్తల కు అబ్ధుల్ అజీజ్ కేక్ తినిపించి మిఠాయిలు పంచి సంతోషం పంచుకున్నారు. మంచి మనసున్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బీద.రవిచంద్ర ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకున్నారు.