vinod kumar
తెలంగాణ రాజకీయం

బండి సంజయ్ నోటికొచ్చినట్లు బీఆర్ఎస్ పై బురదజల్లుడు మానుకోవాలి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్   కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అని హెచ్చరిక చేయడం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేద్దాం అని మాట్లాడడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఇంట్లో మానకొండూర్  మాజీ  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ కు లేదని, 39 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిలో మెజారిటీ సభ్యులతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని అన్నారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు సరికాదని..బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యాసంగి నుంచి  క్వింటాలు కు₹500, రైటుభరోసా పథకం ద్వారా ₹15000లు,, కళ్యాణలక్ష్మీ ద్వారా ₹ లక్షతో పాటు తులం బంగారం, 2లక్షల రుణమాఫీ వంటి హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు.
వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ హామీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ల సాయం చేస్తామన్నారు.200ల యూనిట్ల విద్యుత్ బిల్లు మాఫీ చేస్తామన్నారు.
కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ కడతారని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో మాట్లాడినారని పేర్కొన్నారు.ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. 14ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోట్లాడి తెచ్చుకోవడం జరిగిందని..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 24 గంటల విద్యుత్,  బీడుభూములకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందని,మిషన్ కాకతీయ ద్వారా 44వేల చెరువులు మరమ్మతులు చెశామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు.
ప్రభుత్వం వంద రోజుల్లో 200 యూనిట్ల కరెంటు, తులం బంగారం, మహాలక్ష్మి  ద్వారా 2500, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం₹5లక్షల సాయం వంటి హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం తప్పకుండా చేస్తోందన్నారు.కాంగ్రెస్ పై ప్రజలు ఎన్నో ఆశలతో ఓట్లు వేశారు..ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.