mahila-2500
తెలంగాణ రాజకీయం

ఫిబ్రవరి నుంచి మహిళలకు 2,500

తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ  కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఆరు గ్యారెంటిలో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి రూ. 15 లక్షలకు పెంచింది. తాజాగా మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌లో ఈ స్కీం కోసం నిధులు కేటాయించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహాలక్ష్మి గ్యారెంటీలో  భాగంగా ఈ పథకం అమలు చేయనుంది.

ఎంపీ ఎలక్షన్‌ నోటిఫికేషన్ రాకముందే అమలు చేసే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తించనున్నట్లు తెలుస్తోంది. రేషన్‌ కార్డు ప్రామాణికంగా పథకం అమలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించకపోవచ్చు. భర్త ట్యాక్స్‌ కట్టినా లేదా GST రిటర్న్ ఫైల్‌ చేసిన అర్హులు కాదని సమాచారం. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం పార్లమెంట్ ఎన్నికల ముందు అమల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.