వైకాపా అరాచక పాలపై గలమెత్తి ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా రా…. కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
పార్టీ పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు క్లాస్ వన్ రైల్వే కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు కడప జిల్లా కమలాపురంలో రా…. కదిలిరా బహిరంగ సభ శుక్రవారం
మధ్యాహ్నం జరుగుతున్నట్లు వారు తెలిపారు. బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు తెలిపారు. కడప అన్నమయ్య నెల్లూరు జిల్లాల
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నట్లు తెలిపా.రు అలాగే బద్వేలు నియోజకవర్గ లోని ఏడు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని వారు కోరారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి సమయుత్వం అవుతున్నాయి. వైకాపా పాలనలో జరిగిన విధ్వంసాలు అరాచకాలు వైఫల్యాలు ప్రజల్లోకి
తీసుకువెళ్లేందుకు సభలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా అప్పట్లో ఎన్టీ రామారావు రా….. కదలిరా అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమాల స్ఫూర్తితో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలకు శ్రీకారం పుట్టింది శుక్రవారం కమలాపురం సి ఎస్ ఐ చర్చి మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుంది. లక్షమంది జనంతో భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ముమ్మరంగా సన్నాహాలు
జరుగుతున్నాయి. అందులో భాగంగా బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు కమలాపురం బహిరంగ సభకు రావాలని మాజీ
ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు రైల్వే కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కడప పార్లమెంట్ స్థాయిలో జరిగే ఈ సభకు అన్ని నియోజకవర్గాల నుండి జన సమీకరణకు ఇప్పటికే నియోజకవర్గాల పార్టీల బాధ్యులు సమావేశం నిర్వహించారు వీరితోపాటు పార్టీ కీలక నేతలు ఎవరికివారు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరిగే చంద్రబాబు సభకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది కమలాపురం సి ఎస్ ఐ చర్చి మైదానంలో వేదిక గ్యాలరీల ఏర్పాటు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బద్వేల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.