ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే సర్వేల ఆధారంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్.. వ్యూహాలతో.. అస్త్రశస్త్రాలతో ముందుకువెళ్తున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్వేలు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు.. స్థానిక నాయకుల అంచనాలు.. బలం.. బలగం.. ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని.. నియోజక వర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ.. ఇన్‌ఛార్జులను మారుస్తున్నారు. మొదటి విడతలో 11మంది.. సెకండ్ లిస్ట్‌లో 27మంది, మూడో లిస్ట్‌లో 21 మంది.. నాలుగో లిస్ట్‌లో 9మంది.. ఇలా నాలుగు విడతల్లో 58 అసెంబ్లీ,10 లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జ్‌లని మార్చారు. 4 విడతల్లో 58 అసెంబ్లీ,10 లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జ్‌లని మార్చిన వైసీపీ చీఫ్ జగన్.. త్వరలోనే మరో రెండు విడతల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని సమాచారం..త్వరలో వైసీపీ మరో 4 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ లిస్టుతోనే ఇంకా ముగియలేదని.. వైసీపీలో ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై మరిన్ని కసరత్తులు కొనసాగుతున్నాయని.. చర్చ జరుగుతోంది. త్వరలోనే మరో రెండు జాబితాలు ఉంటాయని వైసీపీ అధిష్ఠానం చెబుతుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ఇదే జరిగితే.. మరో 8 నుంచి 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని, అలాగే నలుగురు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ల మార్పు ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.అయితే ఈనెల 25లోపు ఈ మార్పులు చేర్పులన్నిటినీ పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.. ఈనెల 25 నుంచి క్యాడర్‌తో సీఎం జగన్ సమావేశాలు చేపట్టబోతున్నారు. దీంతో అప్పటికల్లా ఇన్‌చార్జ్‌ల మార్పుల చేర్పుల ప్రక్రియను పూర్తిచేయాలని జగన్ భావిస్తున్నారు. దీంతో రాబోయే లిస్టుల్లో ఎవరి పేరు ఉంటుందో అన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.