శతాబ్దాల హిందువుల కల నెరవేరింది.ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల తర్వాత ఇది సాకారమైంది. ఈ నేపథ్యంలో రామమందిర ప్రస్థానంలో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..
1528: రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మొఘల్ చక్రవర్తి బాబర్ వద్ద పనిచేసే జనరల్ మీర్ బాఖి ఒక మసీదును నిర్మించాడనే వాదనలు ఉన్నాయి.
1853: బాబ్రీ మసీదు విషయంలో బ్రిటిష్ కాలంలో మొదటిసారిగా 1853లో హింస చెలరేగింది. 1859లో వివాద స్థలాన్ని బ్రిటిషర్లు రెండుగా విభజించి, కంచె వేశారు.
1949: బాబ్రీ మసీదు లోపల కొందరు రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించారు.
1950: రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని హిందువుల తరపున గోపాల్ సింగ్ విశారద్, మసీదులో విగ్రహాలను తొలగించాలని హసీం అన్సారీ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి తాళాలు వేసింది.
1980: శ్రీరామ జన్మభూమికి విముక్తి కలిగించి, ఆలయాన్ని నిర్మించాలన్న డిమాండ్‌తో వీహెచ్‌పీ నేతృత్వంలోని ఓ కమిటీ ఉద్యమం ప్రారంభించింది.
1990: రామాలయ నిర్మాణానికి మద్దతుగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ గుజరాత్‌లోని సోమ్‌నాథ్ నుంచి యూపీలోని అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు.
1992: డిసెంబర్ 6న వేలాది మంది కర సేవకులు, వీహెచ్‌పీ కార్యకర్తలు వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇది దేశంలో మత ఉద్రిక్తతలకు దారితీసింది.
2003: వివాదాస్పద స్థలంలో ఏఎస్‌ఐ సర్వే చేపట్టింది. మసీదు నిర్మాణం కింద ఒక హిందూ నిర్మాణం ఉండేదని నివేదించింది. దీన్ని ముస్లింలు వ్యతిరేకించారు.
2010: విస్తృత విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు.. ఆ భూమిని మూడు భాగాలుగా చేసి, రామ్‌లల్లా, ఇస్లామిక్ వక్ఫ్ బోర్డ్, నిర్మొహి అఖారాలకు కేటాయించింది.
2011: మూడు పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
2019: సుప్రీంకోర్టు ఈ కేసును మధ్యవర్తిత్వం కోసం సిఫారసు చేసింది. మధ్యవర్తితంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ. రోజువారీ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 2019, ఆగస్టు 16న తీర్పు రిజర్వ్ చేసింది.
2019, నవంబర్ 9: సుప్రీంకోర్టు రామ్‌లల్లాకు అనుకూలంగా తీర్పునిస్తూ వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని కేంద్రం ఏర్పాటు చేసిన ట్రస్టుకు అప్పగించింది. మసీదు నిర్మాణానికి మరోచోట 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది.
2020: రామ్‌లల్లా విగ్రహాన్ని టెంట్ నుంచి తాత్కాలిక ఆలయానికి తరలింపు. 2020, ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన.
2024, జనవరి 22: దాదాపు నాలుగేండ్లపాటు సాగిన నిర్మాణం తర్వాత.. దేశంలోని హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరగబోతున్నది.