sharmila-subbareddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి మరో జాతీయ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుంది. నిన్న , మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్షాల నుంచి గట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీకి ఈసారి వైఎస్‌ షర్మిల  రూపంలో ప్రారంభమయ్యాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఏపీలో తన అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా విరుచుకు పడుతున్నారు.వైసీపీ సీనియర్‌ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఏపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్‌ జగన్‌ అధికారంలో వచ్చిన తరువాతనే జరుగుతున్నాయని కావాలంటే అభివృద్ధి చూపిస్తానని షర్మిలకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి జగన్‌ను షర్మిల ఏకవచనంతో మాట్లాడడం కరెక్టు కాదని అన్నారు.

దీనికి షర్మిల స్పందిస్తూ ‘చేసిన అభివృద్ధి చూపించండి.తేదీ, సమయం మీరు చెప్పండి. లేదా నేను చెబుతానని ప్రస్తుతం షర్మిల శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ సవాల్‌ విసిరారు. దేనికైనా తాను సిద్ధమేనని అన్నారు. అభివృద్ధి పరిశీలనకు మేధావులను కూడా పిలుద్దామని సూచించారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.