revanth-bandi
తెలంగాణ రాజకీయం

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

ఎంపి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన మీరు ఈ అంశాన్ని  పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిమళ్లించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని అయన కోరారు.