నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏసీబీ అధికారులు తనఖీలు నిర్వహించారు. గురుకుల కళాశాలలో కొనుగోలు చేసిన ఫర్నిచర్, సరుకులు ,విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకున్నారు. అదేవిధంగా సరుకుల వివరాలను, అధ్యాపకుల హాజరు పట్టికను పరిశీలించి వివరాలను అడిగిన తెలుసుకున్నారు. ఇటీవలే ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడులతో నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపింది. వివరాలను నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఏసిబి డిఎస్పి రమణమూర్తి మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారుల సమాచారం తమకు అందించాలని సూచించారు అవినీతిని అరికట్టడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు. తనిఖీల్లో సిఐలు సునీల్ గౌడ్, జాన్ రెడ్డి, సిబ్బంది, తనిఖీల్లో పాల్గొన్నారు.