sunkara padmasri
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

షర్మిలను ఎమైనా అంటే నాలుక చీరేస్తాం

జగన్,వైసీపీ నేతలపై ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ  మండిపడ్డారు. మా అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి పర్యటనలతో జగన్ ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలయ్యింది. జగన్ స్వార్ధపూరిత రాజకీయాలను వైయస్ షర్మిల రెడ్డి ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఎన్నికల సమయంలో జగన్ చెల్లిని,తల్లిని వాడుకుంది నిజం కాదా? సొంత చెల్లి వైయస్ షర్మిల రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన ఘనుడు జగన్. రోజా తనపై  అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ గతంలో కన్నీరు పెట్టుకుంది. ఆసమయంలో మేము రోజాకి అండగా నిలబడ్డాం. జగన్ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. దానిని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశా చట్టం ఎక్కడా అని మా అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి ప్రశ్నించారు.

ఒకవైపు దళితులపై దాడులు చేస్తూ…మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోతుందా అంటూ షర్మిలరెడ్డి ప్రశ్నించడం తప్పా? వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేసి మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారని అన్నారు.
మా వైయస్ షర్మిల రెడ్డి ఆడపిల్లకాదు….ఆడపులి. మీ బెదిరింపులు, వ్యక్తిగత విమర్శలకు భయపడదు, వెనుకడుగు వేయదు. అభివృద్ది ఎక్కడ అంటూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా. రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు…ఇటువంటి విమర్శలు చేసేవారికి సిగ్గుండాలి. వైసీపీ నేతలు మా అధ్యక్షురాలు షర్మిలపై ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామని అన్నారు.