dmk-cong
జాతీయం రాజకీయం

డీఎంకే, కాంగ్రెస్ మధ్య.. గ్యాప్

ఇండియా.  కూటమిలోని ఒక్కో పార్టీ కాంగ్రెస్‌ వరుస పెట్టి విమర్శలు సంధిస్తున్నాయి. ఇప్పటికే జేడీయూ ఏకంగా బీజేపీతో పొత్తుకి సిద్ధమైంది. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌కి దూరంగానే ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితీ ఇంతే. ఇప్పుడు మరో కీలక పార్టీ అయిన డీఎమ్‌కే  కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేసింది. కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ డీఎమ్‌కే మంత్రి ఒకరు తీవ్ర విమర్శలు చేయడం సంచలనమవుతోంది. ఆ పార్టీకి మునుపు ఉన్న బలం లేదని, ఎప్పుడో బలహీనపడిపోయిందని స్పష్టం చేశారు డీఎమ్‌కే మంత్రి రాజా కన్నప్పన్. ఇది కేవలం ఆయన ఒక్కరి అభిప్రాయమా..? లేదంటే నిజంగానే డీఎమ్‌కే, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. “కాంగ్రెస్ కేవలం తన స్వార్థమే చూసుకుంటోంది. కేవలం సీట్‌లు గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీని నడుపుతోంది. దీని వల్ల ఏం ఉపయోగం..? ఓ ఐడియాలజీతో ఉండాలి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఏమీ లేకుండా పోటీ చేస్తానంటే ఎలా..? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీకి అన్నీ గుర్తొస్తాయి.

ఈ ఫార్ములా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ప్రజలు కూడా హర్షించరు. బీజేపీ చాలా చరిత్ర ఉన్న పార్టీయే కావచ్చు. కానీ అప్పటంత బలం ఇప్పుడు లేదు”అటు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎమ్‌కే చీఫ్ ఎమ్‌కే స్టాలిన్ మాత్రం కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరూ కూటమిలో అనవసరమైన విభేదాలు సృష్టించొద్దని నేతలకు సూచిస్తున్నారు. దీని వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీకే మేలు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
సీట్ల కేటాయింపు అంశం మా వ్య‌క్తిగ‌తం. వేరే పార్టీ వారు మాకు ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఎందుకు?  మాతో చ‌ర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని ఇప్పటికే మ‌మ‌తా బెన‌ర్జీ తెగేసి చెప్పారు. అనంత‌రం వెంట‌నే ఆమె మాట మార్చి.. తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా, బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 47 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 10 స్థానాల్లో పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం రెండు క‌న్నా ఎక్కువ సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం ర‌గులుతూనే ఉంది. ఇప్పుడు ఈ వివాదం  మ‌రింత పెరిగి, చివ‌ర‌కు సీఎం బెన‌ర్జీ ఒంట‌రి పోరును ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇండియా కూట‌మిలో ఉన్న మ‌రో పార్టీ  ఆమ్ ఆద్మీ. ఢిల్లీ, పంజాబ్‌ల‌లో అధికారంలో ఉన్న ఈ పార్టీ కూడా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 పార్ల‌మెంటు స్థానాల్లోనూ తామే(ఆప్) ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ కూడా తుది ద‌శ‌కు చేరుకుంద‌ని సీఎం మాన్ చెప్పారు.