మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచింది. తాజాగా యువతుల సాధికారతను పెంచే ఉచిత స్కూటీ పథకం అమలు చేయబోతోంది. 18 ఏళ్లు నిండిన యువతులంతా ఈ పథకానికి అర్హులే. ఈ స్కీం ద్వారా యువతులు ఉచితంగా స్కూటీలు పొంది తాము వెళ్లాలనుకునే చోటుకు వెళ్లొచ్చు. అలాగే యూనివర్సిటీల్లో తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ పథకానికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులకు ఉండాల్సిన అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులు ఏమిటో తెలుసుకుందాం.
– ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకునే యువతి తెలంగాణ పౌరురాలై ఉండాలి.
– తప్పనిసరిగా ఫిమేల్ అయి ఉండాలి.
– ప్రస్తుతం చదువుకుంటూ ఉండాలి.
– తెలంగాణలో పేద కుటుంబానికి చెందిన యువతి అయి ఉండాలి.
– ఇంటర్ పాస్ అయిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన పత్రాలు..
ఉచిత స్కూటీ పథకానికి దరఖాస్తు చేసుకునే యువతులు ఆధార్‌కార్డు, పాన్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం, రెసిడెన్షియల్ ప్రూఫ్, వార్షిక ఆదాయం ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, దరఖాస్తు ఫీజులతోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు కావాలి.స్కూటీ పథకం కోసం ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ (https://telangana.gov.in)లోకి వెళ్లాలి. హోంపేజీలో త్వరలోనే ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంచనున్నారు. అందులో అప్లై ఆన్‌లైన్ బటన్ క్లిక్ చేయాలి. వెంటనే దరఖాస్తు ఫాం ఓపెన్ అవుతుంది. అందులో పేరు, చిరునామా, ఆధార్ నంబర్ వంటి వివరాలు నింపాలి. తర్వాత సంబంధిత పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అంతా పూర్తిచేశాక సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది. అర్హతలు, పత్రాలను పరిశీలించి అన్నీ సరిగా ఉంటే వారిని అర్హులుగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత లబ్ధిదారులకు స్కూటీలు మంజూరు చేస్తుంది. స్కూటీలు తీసుకున్నవారు తప్పనిసరిగా చదువుకునేందుకు వెళ్లాల్సి ఉంటుంది.