modi-pariksha pe charcha
జాతీయం ముఖ్యాంశాలు

గ్యాడ్జెట్లను తగ్గించండి స్టూడెంట్స్ కు మోడీ హితవు

ఇళ్లలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధాని మోదీ సూచించారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులకు ఈ సలహా ఇచ్చారు. ఇళ్లను no gadget zone గా మార్చుకోవాలని, కుటుంబ సభ్యులతో సమయం గడపాలని తెలిపారు. టెక్నాలజీ కారణంగా అందరికీ దూరమైపోకూడదని స్పష్టం చేశారు. లైఫ్‌స్టైల్‌ని మార్చుకోవాలని…ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చే విధంగా మనసుని సన్నద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్డెట్స్‌కే కాకుండా మన శరీరాలనూ రీఛార్జ్ చేసుకోవాలంటూ విద్యార్థులకు అర్థమయ్యే భాషలో వివరించారు ప్రధాని మోదీ. గ్యాడ్జెట్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరమని తెలిపారు. “ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి”
– ప్రధాని నరేంద్ర మోదీ
విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న అంశాన్నీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. కొందరు తమకు తామే అనవసరంగా ఒత్తిడి ఫీల్ అవుతారని చెప్పారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల వల్లా విద్యార్థులపై ఈ ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.”కొన్ని సార్లు విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని బాధ పడతారు. కానీ మీరు పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. క్రమంగా మీ పర్‌ఫార్మెన్స్‌ని పెంచుకోండి. ఆ తరవాతే పరీక్షలకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగలుగుతారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం నాకు కూడా ఓ పరీక్ష లాంటిదే”- ప్రధాని నరేంద్ర మోదీః
➥ పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు. విద్యార్థులు తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
➥ కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి. తద్వారా పరీక్షలు బాగా రాయగలరు.
➥ మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు. అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది. ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారు. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
➥ తల్లిదండ్రులు వారి పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తమ సొంత విజిటింగ్ కార్డ్‌గా భావిస్తున్నారు. ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెబుతారు. అది సరైన విధానం కాదు.
➥ ఉపాధ్యాయులు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదు. విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలి.
➥ విద్యార్థులపై తోటి స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల వల్ల, స్వీయ ప్రేరేపితంగా ఒత్తిళ్లు ఉంటుంది. వీటిని అధిగమించాలి. పోటీ, సవాళ్లు మన జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. కానీ అవి ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ విషయంలోనూ పక్క వాళ్లతో పోటీ పడొద్దు. మీతో మీరే పోటీపడండి.
➥ విద్యార్థులే దేశ భవిష్యత్తు రూపకర్తలు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ‘పరీక్షా పే చర్చ కార్యక్రమం’ నాకూ పరీక్ష లాంటిది.
➥ ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి.
➥ విద్యార్థులు ఒత్తిడిని జయించి మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ పరీక్షలు రాసి విజయం సాధించాలి