వైద్యరత్న నేషనల్ అవార్డు- 2024 సంవత్సరముకు గాను రామగిరి మండలం,కల్వచర్ల గ్రామానికి చెందిన ప్రకృతి వైద్య,యోగ నిపుణురాలు డాక్టర్ శరణ్య యాదవ్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ ప్రకటించడం జరిగింది. అవార్డ్ సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ మరియు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఎంపిక పత్రాన్ని హైదరాబాదులోని జాతీయ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉంటూ సేవారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డ్ కు ఎంపిక చేయడం జరిగిందని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందు తీసుకోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతిఏటా ఉద్యమకారులు, సంఘ సేవకులు ,రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అవార్డు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇట్టి అవార్డును ఫిబ్రవరి 11వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 7వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమంలో Dr. శరణ్య యాదవ్ కు నేషనల్ జాతీయ వైద్యరత్న అవార్డును అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల నుండి దాదాపు 600 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్ రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాధ వెంకటేశం పాల్గొన్నారు.